MLC Kavitha: అయోధ్యకు మాకు ఆహ్వానం అందలేదు

MLC Kavitha: అయోధ్యలో జరుగుతున్న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు తమకు ఆహ్వానం అందలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

Update: 2024-01-21 11:00 GMT

MLC Kavitha: అయోధ్యకు మాకు ఆహ్వానం అందలేదు

MLC Kavitha: అయోధ్యలో జరుగుతున్న శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు తమకు ఆహ్వానం అందలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కలిసిన అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. అయోధ్య టెంపుల్ ట్రస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం అందలేదని చెప్పారు. అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని అన్నారు. అయినా.. రాముడు అందరివాడని.. కొందరివాడు కాదని చెప్పారు. ఏదో ఒక సందర్భంలో తప్పకుండా అయోధ్యను విజిట్ చేసే అవకాశం తప్పకుండా వస్తుందని చెప్పారు. అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించుకున్నట్లే.. ఏదో ఒక రోజు అయోధ్యను కూడా సందర్శించే భాగ్యం తమకు కలుగుతుందని అన్నారు. రేపు జరిగే కార్యక్రమానికి ఎలాంటి అధికారిక ఆహ్వానం లేనందున వెళ్లలేకపోతున్నామని కవిత వెల్లడించారు.

Tags:    

Similar News