Mallu Ravi: బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లింది
Mallu Ravi: మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నాయకులు పగటి కలలకు కంటున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విమర్శించారు.
Mallu Ravi: మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నాయకులు పగటి కలలకు కంటున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. శాస్త్రీయంగా కులగణన చేసి... బీసీ బిల్లును అసెంబ్లీలో పెట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి అని గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓడించినా వారికి బుద్ధిరాలేదని... స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓడిస్తారని ఆయన జోస్యం చెప్పారు.