Bandi Sanjay: బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ అట్టర్‌ప్లాఫ్
Bandi Sanjay: అగ్నిపథ్ గురించి ఏం తెలుసని కేసీఆర్ మాట్లాడుతారు
Bandi Sanjay: బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ అట్టర్‌ప్లాఫ్
Bandi Sanjay: నిన్న ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ అట్టర్ ప్లాఫ్ అయిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. నిన్న ఖమ్మం సభకు కుమారస్వామి, నితీష్ కుమార్ ఎందుకు రాలేదో చెప్పాలన్నారు. తెలంగాణలో 24 గంటల పాటు ఏ గ్రామానికి విద్యుత్ ఇస్తున్నారో చెప్పాలని బండి ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తే బోర్ల సంఖ్య ఎందుకు పెరిగిందో చెప్పాలన్నారు. అగ్నిపథ్ గురించి కేసీఆర్ ఒక్కడైనా ఆలోచించారా అని అన్నారు. బిపిన్ రావత్ ఆలోచనే అగ్నిపథ్ అని బండి సంజయ్ గుర్తు చేశారు.