Mancherial: ఆస్పత్రే కళ్యాణ మండపం.. బెడ్‌పైనే వధువుకు తాళి కట్టిన వరుడు
Mancherial: ఆస్పత్రే కళ్యాణ మండపం.. బెడ్‌పైనే వధువుకు తాళి కట్టిన వరుడు
Mancherial: ఆస్పత్రే కళ్యాణ మండపం.. బెడ్‌పైనే వధువుకు తాళి కట్టిన వరుడు
Mancherial: వివాహానికి ముందు రోజు వధువుకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఒకరిని ఒకరు విడిచి ఉండలేక వరుడు ఏకంగా అసుపత్రినే కళ్యాణ మండపంగా మార్చి.. ఆసుపత్రిలోనే వివాహం చేసుకున్నాడు. ఈ ఆసక్తికర ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంకు చెందిన బానోథ్ శైలజకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజు పల్లె గ్రామానికి చెందిన హట్కార్ తిరుపతికి వివాహం నిశ్చయం అయ్యింది. గురువారం పెళ్లి జరగాల్సి ఉంది. వధువు శైలజ బుధవారం అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని ఓప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు. బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పడంతో ఇన్ పేషేంట్ గా ఉండిపోయింది. విషయం పెళ్లి కుమారుడికి తెలియడంతో కంగారుపడ్డాడు. ఎలాగైనా గురువారం పెద్దలు నిర్ణయించిన ముహూర్తంకు పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో ఇరుకుటుంబ సభ్యలను ఒప్పించాడు. శైలజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి వైద్యులకు విషయం చెప్పాడు. పెళ్లి మండపం లేదు. భాజ భజంత్రీలు లేవు. పీఠలపై జరుగవలసిన పెళ్లి ఆసుపత్రి బెడ్ పై జరిగింది. చికిత్స జరిగి ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న వధువుకు వరుడు తాళికట్టాడు. వైద్యులే పెళ్లి పెద్దలుగా మారారు.