Break-in Coronavirus test Hyderabad: నగరంలో కరోనా పరీక్షలకు బ్రేక్‌!

Coronavirus test in Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంచెలంచెలుగా పెరిగిపోతున్నాయి.

Update: 2020-06-25 12:13 GMT
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంచెలంచెలుగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో 50 వేల కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వం ఆదేశాను సారం అధికారులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కసారిగా నగరంలో కరోనా వైరస్‌ పరీక్షలకు అడ్డుకట్ట పడింది. ఇప్పటికే సేకరించిన శాంపిళ్ల టెస్టింగ్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఈరోజు, రేపు పరీక్షలు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో కరోనా పరీక్షలు చేయాలన్న ప్రభుత్వ ప్రక్రియకు తాత్కాళికంగా బ్రేక్‌ పడింది.

ఇకపోతే ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 10వేలు దాటేసాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కేసులు సంఖ్య 891 నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 10,444కి చేరింది. వీరిలో 4,361 మంది కోలుకుని డిస్చార్జ్‌ అవ్వగా, 5,858 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతున్నారు. 225 మంది మృత్యువాత పడ్డారు.



Tags:    

Similar News