Sagar Bypoll: బీజేపీకి కలిసిరాని ఆపరేషన్ ఆకర్ష్

Sagar Bypoll: నాగార్జునసాగర్‌లో ఆపరేషన్‌ ఆకర్ష్‌ బీజేపీకి కలిసిరాలేదు. టీఆర్ఎస్‌ అసంతృప్తులను తమ వైపు లాక్కునేందుకు చేసిన ప్రయత్నంలో కమలం నేతలు విఫలమయ్యారు.

Update: 2021-03-29 10:58 GMT

Sagar Bypoll: బీజేపీకి కలిసిరాని ఆపరేషన్ ఆకర్ష్

Sagar Bypoll: నాగార్జునసాగర్‌లో ఆపరేషన్‌ ఆకర్ష్‌ బీజేపీకి కలిసిరాలేదు. టీఆర్ఎస్‌ అసంతృప్తులను తమ వైపు లాక్కునేందుకు చేసిన ప్రయత్నంలో కమలం నేతలు విఫలమయ్యారు. ఎంసీ కోటిరెడ్డి బీజేపీలోకి వెళ్లకుండా తీవ్ర ప్రయత్నాలు చేశారు మంత్రి జగదీష్‌రెడ్డి. సాగర్ బీజేపీ అభ్యర్థిగా నివేదితారెడ్డి, కడారి అంజయ్య యాదవ్, ఇంద్రసేనారెడ్డి, రవినాయక్‌లలో ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నోముల భగత్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. భగత్‌కు కేసీఆర్ బీ ఫామ్ ఇచ్చారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ దిగ్గజం జానారెడ్డిని ఢీకొట్టేందుకు సరైన అభ్యర్థి కోసం చివరిదాకా సర్వేలపై సర్వేలు చేసిన సీఎం కేసీఆర్‌ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు భగత్‌కే టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. అభ్యర్థి ఎవరనేది మంత్రులకు, ఎమ్మెల్యేలకు సైతం తెలియకుండా చివరిదాకా సీఎం గోప్యత పాటించారు.

మరోపక్క, కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నేత జనారెడ్డి బరిలోకి దిగారు. బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థులు నామినేషన్లను వేయడానికి ఈ నెల 30 వరకు గడువు ఉంది. 31న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3 వరకు గడువు ఉంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండగా మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. సాగర్ లో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

Tags:    

Similar News