Dharmapuri Arvind: ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ నేతలకు కారాగార దీక్ష..
Dharmapuri Arvind: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలెక్టర్‌ను వివరాలు అడిగితే టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందేంటని బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు.
Dharmapuri Arvind: ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ నేతలకు కారాగార దీక్ష..
Dharmapuri Arvind: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలెక్టర్‌ను వివరాలు అడిగితే టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందేంటని బీజేపీ ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. కోవిడ్ సమయంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడిన గొప్ప మహిళ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అని వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతా రామన్‌ను పట్టుకుని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడారని మండిపడ్డారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రేషన్ వివరాలు అడిగితే తప్పేముందన్నారు. జిల్లా కలెక్టర్ సరైన వివరాలు చెబితే తమ బండారం బయటపడుతుందనే భయం టీఆర్ఎస్ నేతలకు పట్టుకుందన్నారు. కొవిడ్ సమయంలో ఆయుష్మాన్ భారత్ పెట్టని రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓడిపోయాక పెట్టారని విమర్శించారు. 9 నెలల్లో ఎన్నికలు అయిపోయాక టీఆర్ఎస్ నేతలకు కారాగార దీక్ష పెడతామని హెచ్చరించారు.