Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్ బుక్, ఇన్ స్టా అకౌంట్స్ తొలగింపు
Raja Singh
Raja Singh: మెటా దాని మాతృ సంస్థలైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల నుంచి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు చెందిన 2 ఫేస్ బుక్ పేజీలు, 3 ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ తొలగించడంపై ఆయన ఎక్స్ వేధికగా స్పందించారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని సెలెక్టివ్ సెన్సార్ షిప్ దాడి చేస్తోంది. గురువారం నా కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారుల సోషల్ మీడియా ఖాతాలను ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ బ్లాక్ చేయడం దురద్రుష్టకరం. అంతకుముందు రాహుల్ గాంధీ చేసిన ఫిర్యాదు ఆధారంగా నా అధికారిక ఖాతాలకు అన్యాయం జరిగిందన్నారు రాజాసింగ్ .