Etela Rajender: కేసీఆర్ ను చివరి దెబ్బ కొట్టే రోజు వచ్చింది
Etela Rajender: బీజేపీ దళిత మోర్చ ఆధ్వర్యంలో చేపట్టిన డప్పుల మోత కార్యక్రమం ప్రారంభమైంది.
Etela Rajender: కేసీఆర్ ను చివరి దెబ్బ కొట్టే రోజు వచ్చింది
Etela Rajender: బీజేపీ దళిత మోర్చ ఆధ్వర్యంలో చేపట్టిన డప్పుల మోత కార్యక్రమం ప్రారంభమైంది. దళితబంధు అమలు చేయాలంటూ హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ బాబూ జగ్జీవన్ రాం విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు డప్పుల మోత కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్‌చార్జీ తరుణ్ చుగ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్, రాజాసింగ్ పాల్గొన్నారు.
హుజూరాబాద్ ఎన్నికతో కేసీఆర్ పతనం మొదలైందని అదే స్ఫూర్తిని అందిపుచ్చుకుని అడుగు ముందుకేస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ను చివరి దెబ్బ కొట్టే రోజు వస్తుందని దళిత బంధు రాబట్టడానికి దళితుల పక్షాన బీజేపి పోరాడుతుందని ఈటల అన్నారు.