సీఎం కేసీఆర్‌పై డీకే అరుణ ఫైర్‌

Update: 2020-12-14 12:13 GMT

దేశంలో ప్రతిపక్షాలు, రాష్ట్రంలో టీఆర్ఎస్‌ రైతుల్లో అపోహాలు సృష్టిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఏలాంటి నష్టం లేదని తెలిపారు. దళారులే చట్టాలను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో రైతులకు సన్న వరి ధాన్యం సాగు చేయమని చెస్పిన కేసీఆర్‌ వాటిని ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కు ఎన్నికలు వచ్చినప్పుడే రైతులు గుర్తుకు వస్తారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నందుకే 50 వేల ఉద్యోగాలు ప్రకటించారని ఎద్దేవా చేశారు. 

Tags:    

Similar News