School Holiday: విద్యార్థులకు బిగ్ అలర్ట్..నేడు పాఠశాలలకు సెలవు

Update: 2025-01-28 00:19 GMT

School Holiday: తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.నేడు జనవరి 28వ తేదీన పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ రోజు షబ్ ఏ మేరాజ్ అప్షనల్ హాలీడే. ఈ సందర్భంగా హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉంటుంది. అయితే ఈ నెలలో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు ఎక్కువ రోజులు సెలవులు వచ్చాయి. ఇప్పుడు నేడు కూడా సెలవు వచ్చింది.

షబ్ మే మేరాజ్ అంటే ముస్లింల పండగ. ఈ రోజు వారు రాత్రంతా జాగరణ చేస్తారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటారు. అయితే సెలవు అనేది అన్ని పాఠశాలలకు, కళాశాలలకు ఉండకపోవచ్చు. ఆప్షనల్ హాలిడే కాబట్టి విద్యాసంస్థల నిర్ణయం మేరకే సెలవు ఉంటుంది.

గతేడాది ఫిబ్రవరి 8వ తేదీన షబ్ ఏ మేరాజ్ నిర్వహించారు. అయితే అప్పుడు ఆప్షనల్ హాలిడే ను సాధారణ సెలవుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు పలు విద్యాసంస్థలు, కార్యాలయాలకు సెలవు ఇచ్చారు. అయితే ఈసారి ప్రభుత్వం ఏ ప్రకటన చేయలేదు అయినా కూడా చాలా విద్యాసంస్థలు సెలవు ఇచ్చాయి. ఆప్షనల్ హాలిడే కాబట్టి మైనార్టీ విద్యాసంస్థలు హాలిడే ఇచ్చాయి.

Tags:    

Similar News