Weather Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈనెల 26వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.
Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈనెల 26వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈనెల 27న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీ, తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఏపీలోని శ్రీకాకుళం, పార్వతిపురం, విజయనగరం,అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షం పడే సూచనలున్నాయి. ఇటు తెలంగాణలోనూ తొమ్మిది జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణలో మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వాతవరణ శాఖ ప్రకటించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.