Bank Holidays‌: ఖాతాదారులుకు బ్యాడ్ న్యూస్.. బ్యాంకులకు వరుస సెలవులు

Bank Holidays‌: మీరు బ్యాంకు ఖాతాదారులా? లేక బ్యాంకులో ఏదైనా పని ఉందా?

Update: 2021-03-25 09:46 GMT
Banks

Bank Holidays‌: మీరు బ్యాంకు ఖాతాదారులా? లేక బ్యాంకులో ఏదైనా పని ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలు, క్యాష్ బదిలీ, చెక్ సంబంధిత పనులు ఉంటే రెండు రోజుల్లో పూర్తి చేసుకోవాలి. లేదంటే ఈ నెల 27వ తేదీ నుంచి మూడు రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ఈ విషయాన్ని స్వయంగా బ్యాంకు అధికారులే స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ బ్యాంకులు అన్ని మూడు రోజలు మూతపడనున్నాయని బ్యాంకు ఉన్నతాధికారులు తేల్చి చేప్పారు.

తెలంగాణ రాష్ఠ్రంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని మూడు రోజుల పాటు అధికారికంగా పనిచేయవని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఖాతాదారులు గమనించి తమ అవసరాలకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారాలు, పండుగ పర్వదినాలు కాకుండా ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవులు.వరుసగా వచ్చిన సెలవులను పరిశీలిస్తే.. ఈనెల 27న నాలుగో శనివారం, 28 ఆదివారం, 29 హోలీ పర్వదినం ఈ 3 రోజులు బ్యాంకులు పనిచేయవని అధికారులు తెలిపారు. ఈనెల 30, 31 తేదీల్లో బ్యాంకులు పనిచేస్తాయని స్పష్టం చేశారు.

వచ్చే నెల కూడా మూడో తేదీ మినహా మిగిలిన తేదీల్లో బ్యాంకులు ముతపడనున్నాయి. ఏప్రిల్‌ 1వ తేదీ బ్యాంకులు పని చేసినప్పటికీ ఖాతాదారులకు ఎలాంటి ట్రాన్స్ క్షన్లు జరగవని వెల్లడించారు. ఏప్రిల్‌ 2వ తేదీ గుడ్‌ ఫ్రైడే బ్యాంకులు పనిచేయవని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 3న ఒక్క రోజు బ్యాంకులు పనిచేస్తాయన్నారు. 4వ తేదీ ఆదివారం, 5వ తేదీ బాబు జగజ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా సెలవని వివరించారు.10వ తేదీ రెండో శనివారం, 11వ తేదీ ఆదివారం ఈ రెండు రోజులు బ్యాంకులకు సెలవని అధికారులు వెల్లడించారు. 6, 7, 8, 9 తేదీల్లో బ్యాంకులు పని చేస్తాయని అధికారులు వివరించారు. అందుకే బ్యాంక్ కస్టమర్లు ఏదైనా పని ఉంటే ఈ రోజు రేపటిలోగా చూసుకోవాలి లేదంటే వచ్చే నెల మూడో తేదీ వరకు ఎదురుచూడక తప్పదు.

Tags:    

Similar News