Bandi Sanjay: కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదల
* ప్రభుత్వం ముందు 3 డిమాండ్లు పెట్టిన బండి సంజయ్
Bandi Sanjay: కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదల
Bandi Sanjay: కరీంనగర్ జైలు నుంచి విడుదలైన టీబీజేపీ చీఫ్ బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వం ముందు 3 డిమాండ్లు పెట్టారు. TSPSC పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని, కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని, నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేస్తుందని హెచ్చరించారు.
మరోవైపు కేసీఆర్ కుటుంబం, రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు బండి సంజయ్. వాళ్లది లిక్కర్ కుటుంబం, లీక్‌ల కుటుంబమని ఆరోపించారు. త్వరలోనే కూతురు జైలుకు వెళ్తుందని.. కొడుకుకు కూడా రెడీ చేస్తున్నామని చెప్పారు. తనపై పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పిన మంత్రి.. అసలు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదంటూ విమర్శించారు.