Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay: బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులు సహా..

Update: 2023-03-05 10:26 GMT

Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

Bandi Sanjay: సీఎం కేసీఆర్‌కు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన లేఖలో తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, తక్షణమే పీఆర్సీని ఏర్పాటు చేసి.. జులై 1 నుంచి ఉద్యోగులకు పెరిగిన జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే.. ఈ నెల 9న జరగబోయే కేబినెట్‌ భేటీలో పీఆర్సీ ఏర్పాటుతో పాటు.. జులై 1 నుంచి కొత్త పీఆర్సీ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలపై చర్చించి.. అమలయ్యేలా చూడాలని సీఎం కేసీఆర్‌ను లేఖలో కోరారు. తక్షణమే హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు బండి సంజయ్.




Tags:    

Similar News