Bandi Sanjay: కవిత బెయిల్‌పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
Bandi Sanjay: కవితకు బీజేపీ బెయిల్ ఇప్పించిందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది
Bandi Sanjay
Bandi Sanjay: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కవిత బెయిల్‌కు బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఒక పార్టీ .. ఒక వ్యక్తి చెబితే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందనడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ వ్యాఖ్యలు సుప్రీంకోర్టును దిక్కరించే విధంగా ఉన్నాయన్నాుర.
బీఆర్ఎస్ గడీలను బద్దలు కొట్టిన చరిత్ర బీజేపీదని.. బీఆర్ఎస్ తో కలిసి పని చేసి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. కలలో కూడా బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదన్నారు. కుటుంబ పాలన, అవివీనీతి పాలనకు బీజేపీ వ్యతిరేకమన్నారు. భవిష్యత్తులో ఒకదానిలో ఒకటి విలీనం అయ్యే పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలన్నారు బండి సంజయ్.