Bandi Sanjay: సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు
Bandi Sanjay: చెప్పులేసుకుని ఆలయంలోకి వెళ్లేంత మూర్ఖుడు కాదు
Bandi Sanjay: సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు
Bandi Sanjay: మాజీ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పులేసుకుని వేములవాడ రాజన్న ఆలయంలోకి వెళ్లారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పులకు, సాక్సులకు తేడా తేయడం లేదంటూ మండిపడ్డారు. ప్రకాశ్ జవదేకర్ దైవభక్తి ఉన్న నాయకుడన్నారు. చెప్పులేసుకుని ఆలయంలోకి వెళ్లేంత మూర్ఖుడు కాదని తెలిపారు. 73 ఏళ్ల వ్యక్తిపై ఇంత దుర్మార్గపు ప్రచారం చేయడం తగదన్నారు. వేములవాడ ఆలయంలో పూజారిని అడిగితే అసలు విషయం తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.