Bandi Sanjay: రైతుల ఆత్మహత్యలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది

Bandi Sanjay: రైతుబంధు ఇచ్చి.. మిగతా సబ్సిడీలను రద్దు చేశారు

Update: 2023-01-29 09:03 GMT

Bandi Sanjay: రైతుల ఆత్మహత్యలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది

Bandi Sanjay: మేము ముందస్తు ఎన్నికలకు సిద్ధమని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీలో కోవర్టులు ఉండరని, బీజేపీ సిద్ధాంతం గల పార్టీ అన్నారు బండి సంజయ్.. రైతుల ఆత్మహత్యలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందన్నారు. కేసీఆర్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని బండి విమర్శించారు. ఒక్క రైతుబంధు ఇచ్చి.. మిగతా సబ్సిడీలను రద్దు చేశారని ఆరోపించారు. పంజాబ్‌లో రైతులకు చెల్లని చెక్కులు ఇచ్చారని ఆరోపించారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాన్నారు బండి సంజయ్ లంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా.. బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎక్కడయినా మేము చర్చకు సిద్ధమేనని వెల్లడించారాయన.

Tags:    

Similar News