అసెంబ్లీరద్దు అంశంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay: కేసీఆర్‌కు ఈడీ, సీబీఐ దాడుల భయం పట్టుకుంది
అసెంబ్లీరద్దు అంశంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay: రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు చర్చపై బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఈడీ , సీబీఐ కేసులు, ప్రజల్లో వ్యతిరేకతతో భయపడి అసెంబ్లీ రద్దు చేయాలన్న చర్చ మొదలు పెట్టినట్లు చెప్పారు. త్వరలో జరగబోయే మునుగోడు ఎన్నికతోపాటు, సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్న ఆయన కేసీఆర్ కొడుకు, కూతులు చేసిన అవినీతి అక్రమాస్తుల సంపాదన చూసి ఆశ్చర్యపోతున్నారని ఆరోపించారు. అందుకే అసెంబ్లీని రద్దు చేసే ప్రజల్ని మరోసారి హామీలతో మభ్య పెట్టాలని చూస్తున్నారన్నారు. తెలంగాణలో24 గంటలు సరిగా కరెంట్ ఇవ్వలేని కేసీఆర్ దేశ వ్యాప్తంగా ఎలా ఇస్తాడో చెప్పాలని సెటైర్లు వేశారు.