Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలు ఒక్కటే

Bandi Sanjay: రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థులుగా కేసీఆర్ 30 మందిని ఎంచుకున్నారు

Update: 2023-06-22 06:17 GMT

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలు ఒక్కటే

Bandi Sanjay: కరీంనగర్ ​57వ డివిజన్‌లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రారంభించారు. 9 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని బండి సంజయ్ ప్రజలకు వివరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్​పార్టీల ఉమ్మడి అభ్యర్థులుగా 30 మందిని కేసీఆర్ ఎంచుకున్నారని... వారు కాంగ్రెస్​నుంచి గెలిస్తే బీఆర్‌ఎస్‌లోకి తీసుకువచ్చేలా ప్లాన్​చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినా లాభం లేదని... గెలిచిన తర్వాత వారు బీఆర్ఎస్‌లో చేరతారని బండి సంజయ్ అన్నారు.

Tags:    

Similar News