లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ అశోక్

Badangpet: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Update: 2022-09-20 13:33 GMT

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బుల్లెట్ బండి సాంగ్ ఫేమ్ అశోక్

Badangpet: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారుల దాడుల్లో 30 వేల రూపాయలు లంచం తీసుకుంటూ.. టీపీవో అశోక్ పట్టుబడ్డాడు. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానర్‌గా పనిచేస్తున్నాడు అశోక్. ఓ ఇంటి పర్మిషన్ కోసం రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు అశోక్. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించగా.. వలపన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం అశోక్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. బుల్లెట్ బండి ఫేమ్‌గా అశోక్‌ గుర్తింపు పొందాడు.

Tags:    

Similar News