Babu Mohan: బీజేపీకి మాజీ మంత్రి బాబు మోహన్‌ రాజీనామా

Babu Mohan: ఆందోల్‌ నుంచి 2018, 2023లో బీజేపీ అభ్యర్థిగా పోటీ

Update: 2024-02-07 09:31 GMT

Babu Mohan: బీజేపీకి మాజీ మంత్రి బాబు మోహన్‌ రాజీనామా

Babu Mohan: బీజేపీకి మాజీ మంత్రి బాబు మోహన్‌ రాజీనామా చేశారు. ఆందోల్‌ నియోజకవర్గం నుంచి 2018, 2023లో బీజేపీ తరఫున బాబుమోహన్‌ పోటీ చేశారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తన రాజీనామా లేఖను బీజేపీ పెద్దలకు పంపిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వరంగల్ లోక్ సభకు పోటీ చేస్తానన్నారు. ఏ పార్టీలోకి వెళ్లాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదని బాబు మోహన్‌ తెలిపారు.

Tags:    

Similar News