Ask KTR: ఫిలిం యూనివర్సిటీ కావాలన్న టాలీవుడ్ నిర్మాత.. స్పందించిన కేటీఆర్..

Ask KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

Update: 2022-05-08 15:21 GMT

Ask KTR: ఫిలిం యూనివర్సిటీ కావాలన్న టాలీవుడ్ నిర్మాత.. స్పందించిన కేటీఆర్..

Ask KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. నెటిజన్ల రిక్వెస్ట్ లకు వేగంగా స్పందిస్తారు. అప్పుడప్పుడు ఆస్క్ కేటీఆర్ పేరుతో స్వయంగా ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇవాళ కూడా కేటీఆర్ లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ కూడా ఓ ప్రశ్న అడిగారు. తెలుగు వినోద రంగానికి ప్రపంచస్థాయి ఫిలిం స్కూల్ గానీ యూనివర్సిటీ గానీ నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ ను భారతీయ చిత్ర రంగానికి కేంద్రబిందువుగా మార్చవచ్చని శ్రీధర్ సూచించారు.

దీనిపై కేటీఆర్ స్పందించారు. ఈ దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కేటీఆర్ బదులిచ్చారు. కొవిడ్ మహమ్మారి కారణంగా అనేక ప్రణాళికలు ఆలస్యం అయ్యాయని కేటీఆర్ రిప్లయ్ ఇచ్చారు. ఇక, తన కుమారుడు హిమాన్షు ఓక్రిడ్జ్ స్కూల్ క్రియేటివ్ యాక్షన్ సర్వీసెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికవడం పట్ల కూడా కేటీఆర్ స్పందించారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఓ తండ్రిగా గర్విస్తున్నానని తెలిపారు. 

Tags:    

Similar News