సీఎం డెడ్‌లైన్‌ విధించినా ఎవ్వరూ విధుల్లోకి చేరట్లేదు- అశ్వత్ధామ

Update: 2019-11-04 14:07 GMT
ashwathama reddy

సీఎం డెడ్‌లైన్‌ విధించినా ఎవ్వరూ విధుల్లోకి చేరట్లేదన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్ధామ. అన్ని ఆర్టీసీ యూనియన్లు వేరువేరుగా సుధీర్ఘ సమావేశాలు నిర్వహించుకున్నాయని, ఆదివారం 11 మంది విధుల్లోకి చేరితే.. ఈరోజు తిరిగి ఐదుగురు సమ్మెలో చేరారని తెలిపారు. ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించాలని, చర్చలద్వారానే మస్యలు పరిష్కారమవుతాయన్నారు. ప్రభుత్వం.. ఆర్టీసీ సమస్యను మానవీయ కోణంలో చూడాలని, చర్చిస్తే తాము సమ్మెను విరమించడానికి సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. రేపు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని డిపోల ముందు మానవహారాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. 

Tags:    

Similar News