పౌరసత్వ సవరణ బిల్లు చించేసిన ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

మోదీ ప్రభుత్వం పౌరసత్వ (సవరణ) బిల్లును అమిత్‌షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మతప్రాతిపదిక పౌరసత్వా సవరణ బిల్లును కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్‌ కాంగ్రెస్, వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2019-12-09 17:13 GMT
Asaduddin Owaisi

మోదీ ప్రభుత్వం పౌరసత్వ (సవరణ) బిల్లును అమిత్‌షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మతప్రాతిపదిక పౌరసత్వా సవరణ బిల్లును కాంగ్రెస్, సీపీఎం, తృణమూల్‌ కాంగ్రెస్, వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభలో పౌరసత్వ బిల్లు సందర్భంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాపైను నియంత హిట్లర్‌, డేవిడ్ బెన్ గురియన్ లా కనిపిస్తుందని అన్నారు. పౌరసత్వ బిల్లు నుంచి దేశాన్ని రక్షించడం తోపాటు అమిత్ షాను కూడా రక్షించాలని కోరారు. ఇజ్రాయెల్ పౌరసత్వ చట్టాలు చేసిన హిట్లర్, డేవిడ్ బెన్ లానే హోమంత్రి కూడా ఉంటారని, జర్మనీలో ప్రాతిపదికపై ఏర్పాటు చేసిన నురెమ్‌బర్గ్‌ చట్టాలు చేసిన జాబితాలో హోంమంత్రి అమిత్ షా చేరతారని వ్యాఖ్యానించారు. సభలోనే బిల్లు పేపర్లు చించేశారు.

అంతేకాకుండా సర్బానంద కేసులో సుప్రీంలో కోర్టు వెలువరించిన తీర్పు ఉల్లంఘిస్తున్నారని అన్నారు. ఈ బిల్లు ప్రాథమిక హక్కులు కాలరాస్తుందని, రాజ్యాంగానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. తాము ఈ బిల్లు వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. స్పీకర్‌ ఓం బిర్లా అసదుద్దీన్‌ వ్యాఖ్యలను తప్పుపట్టారు. సభలో ప్రవర్తించాల్సిన తీరు ఇదికాదన్నాని సూచించారు. అసదుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలను సభ రికార్డులను తొలిగిస్తున్నమని వెల్లడించారు

Full View

Tags:    

Similar News