Municipal Elections 2020: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

Update: 2020-01-24 06:59 GMT

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. శనివారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 24 వార్డులకు 48 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కించనున్నారు. 34 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 8 మంది రిటర్నింగ్ అదికారులు, 24 మంది సూపర్ వైజర్లు, 56 మంది పోలింగ్ అసిస్టెంట్లు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144వ సెక్షన్ విధించారు.

మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మున్సిపల్ కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. కౌంటింగ్ ఏర్పాట్లుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగనంద్ రెడ్డి అందిస్తారు.


Full View


Tags:    

Similar News