విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం: మైనారిటీలకు అవకాశం

విదేశాలలో చదువుకుంటే మంచి ఉద్యోగం ఒస్తుందని, మంచి భవిష్యత్తు ఉంటుందని ఎంతో మంది విద్యార్థులు విదేశీ విద్యావిధానం వైపు మొగ్గు చూపుతారు.

Update: 2020-02-22 08:22 GMT

విదేశాలలో చదువుకుంటే మంచి ఉద్యోగం ఒస్తుందని, మంచి భవిష్యత్తు ఉంటుందని ఎంతో మంది విద్యార్థులు విదేశీ విద్యావిధానం వైపు మొగ్గు చూపుతారు. తమ ఉన్నత చదువులను విదేశాలలోనే కొనసాగించడానికి ఇష్టపడతారు. అంతే కాదు ఇంకా పరిస్థితులు అనుకూలిస్తే అక్కడే స్థిరపడదాం అనుకుంటారు. ఈ ఆలోచన ప్రతి విద్యార్థిలోనూ ఉంటుంది. కానీ కొంత మంది విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం వలన వారు విదేశీ విద్యను పొందలేకపోతున్నారు.

ఇలాంటి యువతకు చేయూతకు ఇవ్వడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఉన్నత చదువుల కోసం అర్హత ఉన్న విద్యార్థులకు ఏకంగా రూ.20 లక్షల స్కాలర్ షిప్ ను ప్రకటిస్తుంది. ఇందుకోసం సీఎం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్స్‌ మైనార్టీ సంక్షేమశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. విద్యార్థులు తమ పూర్తి వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, కావాల్సిన ధ్రువపత్రాలను సమర్పించాలి తెలిపింది.

ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్దులు, పార్సీలు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేయదలిచిన అభ్యర్థులు డిగ్రీ, ఇంజినీరింగ్‌లలో 60 శాతం మార్కులు పొందిన వారై ఉండాలి. ఇక పీహెచ్‌డీ చేయదలిచిన వారు పీజీలో 60 శాతం మార్కులు పొంది ఉండాలని తెలిపారు. దాంతో పాటుగానే ఆగస్టు 2019 నుంచి డిసెంబర్‌ 2019 వరకు ఎంపిక చేయబడిన విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొంది ఉండాలని తెలిపారు. వీరందరూ మార్చి 12వ తేదీ వరకు ఈ అవకాశం ఉందని, అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాలన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది.

ఇక ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు ఆ దరఖాస్తును జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో ఇవ్వాలని తెలిపారు. ఒక వేళ ఇవ్వకపోయినట్లయితే ఆ దరఖాస్తులను పరిశీలించరని స్పష్టం చేసారు. ఆశావహులు www. telangana epass. cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం 040 -23240134 నంబర్‌ను సంప్రదించవచ్చు. 

Tags:    

Similar News