Telangana: నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి శిక్షణకు ధరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మధుసూదన్ నాయక్ తెలిపారు.

Update: 2020-01-23 15:05 GMT

నాగర్ కర్నూలు: జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మధుసూదన్ నాయక్ తెలిపారు. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు అర్హులని, గ్రామీణ ప్రాంతాల వారికి లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి రెండు లక్షల రూపాయలు ఆదాయం ఉండాలన్నారు. కావున ఆసక్తి గల నిరుద్యోగ యువకులు మూడు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ సంబంధిత పత్రాలతో జనవరి 31వ తేదీలోగా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం నాగర్ కర్నూల్ యందు సమర్పించాలని సూచించారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లో మూడు నెలల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు.

Tags:    

Similar News