లోన్‌ యాప్‌ వేధింపులకు మరో యువకుడు బలి

* పెద్దపల్లి జిల్లా రామగుండంలో పనిచేస్తున్న సంతోష్‌ * యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్న సంతోష్‌ * వాయిదాలు చెల్లించకపోవడంతో వేధింపులు * ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంతోష్ మృతి * ఆత్మహత్యాయత్నానికి ముందు సంతోష్ సెల్ఫీ వీడియో

Update: 2020-12-25 06:41 GMT

తెలంగాణలో రోజు రోజుకు ఆన్‌లైన్‌ యాప్‌ నిర్వాహకుల అరాచకాలు బయటపడుతున్నాయి. తాజాగా.. వారి ఆగడాలకు మరో యువకుడు బలిపోయాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో పనిచేసే విశాఖకు చెందిన సంతోష్‌.. ఓ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.

 అవసరాల కోసం ఉదార్‌ యాప్‌లో 9వేల 319, రుఫిల్లో యాప్‌లో 9వేల 197 రూపాయలు.. అదేవిధంగా ఏఏఏ యాప్‌లో 16వేల 600, లోన్‌గ్రాన్‌లో 11వేల 770 రూపాయలు లోన్‌ తీసుకున్నాడు. అయితే.. సరైన సమయంలో వాయిదాలు చెల్లించకపోవడంతో యాప్‌ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో మనస్తాపానికి చెందిన సంతోష్‌.. ఈ నెల 18న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో అతడిని.. వైజాగ్‌లోని కింగ్‌ జార్జ్‌ హాస్పిటల్‌లో చేర్పించారు.

 ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంతోష్‌ నిన్న మృతి చెందాడు. ఆత్మహత్యాయత్నానికి ముందు తన ఆవేదనను ఓ వీడియో రూపంలో పోస్ట్ చేశాడు సంతోష్. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News