Anjani Kumar: తదుపరి డీజీపీగా అంజనీకుమార్..?
Telangana DGP: ఈనెల 31తో అంటే మరో నాలుగు రోజుల్లో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీకాలం పూర్తికానుంది.
Anjani Kumar: తదుపరి డీజీపీగా అంజనీకుమార్..?
Telangana DGP: ఈనెల 31తో అంటే మరో నాలుగు రోజుల్లో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీకాలం పూర్తికానుంది. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం DOTPకి రాష్ట్ర ప్రభుత్వం పేర్లు పంపించలేదు. ఇంఛార్జ్ డీజీపీని నియమించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు డీజీపీ పోస్ట్‌కు పోటీ పడుతుండగా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. గతంలో ఇంఛార్జ్ డీజీపీగా పనిచేసిన అంజనీకుమార్‌కు ఈసారి కూడా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సంవత్సరంలోనే తెలంగాణకు పూర్తిస్థాయి డీజీపీని నియమించే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురి పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. డీజీపీ రేస్‌లో అంజనీకుమార్, రవిగుప్తా, జితేందర్ ముందంజలో ఉన్నారు.