బుల్లితెర యాంకర్, నటి శ్రీముఖిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె సోదరుడు శుశ్రుత్ గురువారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్-3 హౌస్‌లో కంటెంట్‌గా ఉన్న తన సోదరిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు కామెంట్లు పెడుతున్నారన్నారు. తప్పుడు ప్రచారంతో ఆమెను బిగ్‌బాస్-3 హౌజ్ నుంచి పంపించే కుట్ర జరుగుతోందని.. బాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు శుశ్రుత్.