Allu Arjun released: చంచల్ గూడ జైలు నుంచి సినీనటుడు అల్లు అర్జున్ విడుదలయ్యారు. శనివారం ఉదయం ఆయన్ను జైలు అధికారులు విడుదల చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో న్యాయవాదులు బెయిల్ పత్రాలతోపాటు రూ. 50వేల పూచీకత్తును జైలు సూపరింటెండ్ కు సమర్పించారు. దీంతో అల్లు అర్జున్ ను విడుదల చేశారు. అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలిరావడంతో జైలు దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.