Singareni: సింగరేణి గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధం.. పోటీలో 13 కార్మిక సంఘాలు

Singareni: రేపు ఏడోసారి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు

Update: 2023-12-26 09:57 GMT

Singareni: సింగరేణి గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధం.. పోటీలో 13 కార్మిక సంఘాలు

Singareni: సింగరేణి గుర్తింపు ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యాయి. రేపు ఏడోసారి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. సింగరేణిలోని 11 ఏరియాల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. 84 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బందిని సింగరేణి ఎన్నికల విధులకు తీసుకున్నారు. ఎన్నికలు సజావుగా జరగేందుకు అటు.. పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News