Asaduddin Owaisi Welcomes CM KCR Decision: సీఎం కేసీఆర్ నిర్ణయానికి ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మద్దతు!

Asaduddin Owaisi Welcomes CM KCR Decision: తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంగణంలో ఉన్న ఓ ఆలయం, రెండు మసీదులను కూడా నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే

Update: 2020-07-10 16:48 GMT
Asaduddin Owaisi

Asaduddin Owaisi Welcomes CM KCR Decision: తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా ఆ ప్రాంగణంలో ఉన్న ఓ ఆలయం, రెండు మసీదులను కూడా నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే దీనిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా ఎన్నికోట్లయినా వెనుకాడకుండా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ''తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లౌకిక స్ఫూర్తిని కొనసాగిస్తాం. ఇది కాకతాళీయంగా జరిగిన సంఘటన. దీన్ని అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలి'' అని ముఖ్యమంత్రి కోరారు.

అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటనకు ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మద్దతు పలికారు. దీనికి సంబంధించి యునైటెడ్‌ ముస్లిం ఫోరం తరఫున పూర్తి ప్రకటన విడుదల చేస్తామని శుక్రవారం వరుసగా ట్వీట్లు చేశారు. "సెక్రటేరియట్ భవనాల కూల్చివేత సమయంలో మసీదులు మరియు దేవాలయాలను కూల్చివేసినందుకు ప్రభుత్వ విచారం వ్యక్తం చేస్తూ తెలంగాణ సిఎంఓ విడుదల చేసిన ప్రకటనను నేను స్వాగతిస్తున్నాను." అని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ట్వీట్ చేశారు.

ఇక తెలంగాణ సచివాలయం భవన కూల్చివేత పనులు ప్రారంభించిన ప్రభుత్వం అదే స్థానంలో కొత్త భవనం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే నూతన భవన డిజైన్ ను ఇప్పటికే విడుదల చేసింది. కొత్త భవనం నమూనా ఫొటోను ముఖ్యమంత్రి కార్యాలయం తాజాగా విడుదల చేసింది. ఈ భవనం ఆరు అంతస్తుల్లో నిర్మించాలని అధికారులు డిజైన్ చేశారు. త్వరలో డిజైన్‌కు సీఎం కేసీఆర్ కూడా ఆమోద ముద్ర వేయనున్నారు. ఏడాదిలోపే ఈ నిర్మాణం పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది.


Tags:    

Similar News