అబ్బాయిలు తిరిగితే తప్పులేదా.. అమ్మాయి తిరిగితేనే తప్పా? అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ చేశారు.
అబ్బాయిలు తిరిగితే తప్పులేదా.. అమ్మాయి తిరిగితేనే తప్పా? అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ చేశారు. కాలానికి తగ్గట్లుగా అందరూ మారాల్సిన అవసరముందన్నారు. ఇది పాత రాతి యుగం కాదని, సమయానుకూలంగా మన మైండ్ సెట్ మారాలనీ అన్నారు. టీనేజీ అబ్బాయిలు బైకులపై ఇష్టానుసారం తిరుగుతున్నప్పుడు అమ్మాయిలకెందుకు ఆంక్షలు పెట్టాలని అన్నారు. అమ్మాయిలు ఇష్టపూర్వకంగా ఏ అబ్బాయితోనైనా వెళుతుంటే ఆపడానికి మనమెవరం అని ప్రశ్నించారు.
యువత తన మైండ్ సెట్ మార్చుకోవాలని అమ్మాయిలకు సముచిత గౌరవం, స్థానం కల్పించాలని అన్నారు. తల్లులు అమ్మాయి, అబ్బాయి ఇద్దరినీ ఒకే విధంగా ట్రీట్ చేయాలని, అమ్మాయిలకు మాత్రమే ఆంక్షలు వర్తింప చేయడం తగదనీ అన్నారు. అసదుద్దీన్ నోట ఇలాంటి వ్యాఖ్యలు రావడం సంచలనంగా మారింది.