Mallikarjun Kharge: రేపు హైదరాబాద్‌కు రానున్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే
Mallikarjun Kharge: పాల్గొననున్న 40 వేల మంది బూత్ లెవల్ ఏజెంట్స్
Mallikarjun Kharge: రేపు హైదరాబాద్‌కు రానున్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే
Mallikarjun Kharge: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే.. రేపు హైదరాబాద్ రానున్నారు. రేపు ఎల్బీస్టేడియంలో జరగబోయే బూత్ లెవల్ ఏజెంట్స్ సమావేశానికి ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది.
దాదాపు 40 వేల మంది పార్టీ కార్యకర్తలతో జరగబోయే ఈ సమావేశంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై... దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబంధించి పార్టీ శ్రేణులకు ఖర్గే పలు సూచనలు చేయనున్నారు.