Mallikarjun Kharge: ఇవాళ హైదరాబాద్‌కు ఏఐసీసీ చీఫ్ ఖర్గే
Mallikarjun Kharge: ఎల్బీ స్డేడియంలో కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్స్‌తో సమావేశం
Mallikarjun Kharge: ఇవాళ హైదరాబాద్‌కు ఏఐసీసీ చీఫ్ ఖర్గే
Mallikarjun Kharge: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే.. నేడు హైదరాబాద్ రానున్నారు. ఎల్బీస్టేడియంలో జరగబోయే బూత్ లెవల్ ఏజెంట్స్ సమావేశానికి ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది.
దాదాపు 40 వేల మంది పార్టీ కార్యకర్తలతో జరగబోయే ఈ సమావేశంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై... దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంబంధించి పార్టీ శ్రేణులకు ఖర్గే పలు సూచనలు చేయనున్నారు.