Telangana: వరి సన్నరకాలే సాగు చేయాలి- నిరంజన్‌రెడ్డి

Telangana: కొవిడ్ నేప‌థ్యంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి యాసంగి పంటను కొనుగోలు చేస్తామన్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి.

Update: 2021-03-30 11:33 GMT

Telangana: వరి సన్నరకాలే సాగు చేయాలి- నిరంజన్‌రెడ్డి

Telangana: కొవిడ్ నేప‌థ్యంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి యాసంగి పంటను కొనుగోలు చేస్తామన్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి. 20 వేల కోట్ల రూపాయల బ్యాంక్ రుణం ద్వారా పంటను కొనుగోలు చేస్తామని వెల్లడించారు. విదేశాలకు పంపే విధంగా పంటలు పండించాలని సూచించారు. కరెంట్, నీటి లభ్యత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని వానాకాలం 61 లక్ష ఎకరాలలో పత్తి సాగు అయ్యిందన్న ఆయన గతంలో 50 లక్షల ఎకరాల్లో సాగు అయ్యేది రాబోయే రోజుల్లో రైతులు అదనంగా 15 లక్షల ఎకరాల్లో పత్తి వేయాలని సూచించారు. సాగు ప‌ద్ధతుల్లో గ‌ణ‌నీయ‌మైన మార్పులు రావాలన్నారు. ఒక‌రిని చూసి ఒక‌రు వ‌రి సాగు చేయ‌క‌పోవ‌డం మంచిద‌న్నారు. వ‌రి స‌న్న‌ర‌కాలే సాగు చేయాల‌ని సూచించారు.

Tags:    

Similar News