Pallavi Prashant: బిగ్‌బాస్ విన్నర్ కేసులో తీర్పు వాయిదా

Pallavi Prashant: రేపు తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నాం

Update: 2023-12-21 11:45 GMT

Pallavi Prashant: బిగ్‌బాస్ విన్నర్ కేసులో తీర్పు వాయిదా 

Pallavi Prashant: బిగ్‌బాస్ విన్నర్ కేసులో తీర్పును రేపటికి వాయిదా వేసింది నాంపల్లి కోర్ట్. ప్రశాంత్‌కు బెయిల్ మంజూరు చేయాలని ప్రశాంత్ తరపు న్యాయవాది కోరగా.. బెయిల్‌పై తీర్పు రేపటికి వాయిదా వేసింది. పోలీసుల భద్రత లేకపోవడం వల్లే పరిణామాలు జరిగాయని.. విన్నర్ అయినా... ప్రశాంత్‌కు బయట జరిగిన విషయాలు తెలియదని కోర్ట్‌కు న్యాయవాది తెలిపారు. కాగా.. పల్లవి ప్రశాంత్ బయటికి వచ్చిన తర్వాతనే.. అతని అనుచరులు గొడవ చేశారని.. ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలు ధ్వంసం చేశారని.. అడ్డొచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వారని పీపీ వాదించారు.

బెయిల్ వాదనల సందర్భంగా పోలీసుల విచారణపై న్యాయవాది లక్ష్మణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పల్లవి ప్రశాంత్‌పై అక్రమంగా కేసు నమోదు చేశారని.. జూబ్లీహిల్స్ పోలీసులు మొదట నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని.. కానీ.. అక్రమంగా అరెస్ట్ చేసి.. రిమాండ్ చేశారని మండిపడ్డారు. నేరం చేయని వ్యక్తిని ఎలా రిమాండ్ చేస్తారని న్యాయవాది ప్రశ్నించారు.. ఎవరో అల్లరిమూకలు చేశే అల్లర్లకు పల్లవి ప్రశాంత్ కి సంబంధం లేదన్నారు. రేపు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News