ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో వనమూలికలతో వైద్యం

Update: 2020-08-27 05:56 GMT

Adilabad tribals goes with herbs for treatment: కాలం మారుతుంది. ఆధునిక ప్రపంచంలో ఎన్నెన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పూర్వీకులం నుంచి వస్తున్న ఆచారాలు కనుమరుగువుతున్నాయి. అయితే వనమూలికా వైద్యాన్ని మళ్లీ బతికిస్తూ గిరిజనలు రోగాలు దూరం చేసుకుంటున్నారు. విరిగే ఎముకల నుంచి కదలలేని పక్షపాతం వరకు వనమూలికల వైద్యంతో మాటుమాయం చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవులను నమ్ముకొని ఆదివాసీలు జీవనం సాగిస్తున్నారు. ఆ అడవుల్లో ప్రసిద్ధి చెందిన వన మూలికలను మొండి రోగాలను దూరం చేసే సంజీవనిలుగా ఆదివాసీలు భావిస్తుంటారు.

అదివాసీలు ప్రకృతి వైద్యానికి అధిక ప్రాదాన్యత ఇస్తారు. పోలాల అమావాస్య ముగిసిన మరుసటి రోజు మాథూర్‌ నిర్వహిస్తారు. అనంతరం శివునికి పత్యేక పూజలు చేసి అడవిలో లభించి అరుదైన వనమూలికలు ఇంటికి తెచ్చుకొని వైద్యం కోసం ఉపయోగించుకుంటారు. వర్షకాలంలో సీజన్‌ జ్వరాలతో గిరిజనులను తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. విష జ్వరాలు ప్రబలినప్పుడు వనమూలికల ఔషాదాన్ని తాగితే జ్వరం తగ్గుతుందని గిరిజనలు అంటున్నారు. ఆయుర్వేద వైద్యంతో ఎలాంటి సైడ్‌ ఎఫేక్ట్‌ లేవని గిరిజనులు అంటున్నారు. ఏళ్లుగా ఆయుర్వేద మందులు వాడుతున్నామని చెబుతున్నారు. సంప్రదాయ వైద్యం కావడంతో ప్రతి ఇంట్లో వనమూళికలు ఉంటాయి. తమ ప్రాణాలు కాపాడే వనమూళికలపై పరిశోనదలు చేపట్టాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Tags:    

Similar News