Heavy Rains: ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి కొత్త మార్గం సూచించిన నిర్మల్ పోలీసులు
Heavy Rains: భారీ వర్షాల కారణంగా రహదారి పరిస్థితులు విషమంగా మారిన నేపథ్యంలో, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించే వాహనదారులకు నిర్మల్ జిల్లా పోలీసులు పలు సూచనలు జారీ చేశారు.

నిర్మల్ సమీపంలోని కొండాపూర్ బ్రిడ్జి వద్ద నుంచి ఎడమవైపు డైవర్షన్ తీసుకుని ప్రయాణించాల్సిందిగా సూచించారు. వాహనదారులు ఆదిలాబాద్ నుంచి కామారెడ్డి మార్గం బదులు, కొండాపూర్ – మామడ – ఖానాపూర్‌మెట్ – జగిత్యాల – కరీంనగర్ మార్గంలో హైదరాబాద్ చేరుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల సూచించారు.
ఈ మార్గదర్శకాలను అనుసరించడంతో ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశముందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు.