Weather Update: గజగజ వణుకుతున్న ఆదిలాబాద్.. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చలి!

Weather Update: ఆదిలాబాద్ జిల్లాలో శీతల గాలుల తీవ్రత పెరిగింది. గతంలో ఎన్నడు లేని విధంగా నవంబర్ మూడో వారంలో ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Update: 2025-11-20 06:20 GMT

Weather Update: గజగజ వణుకుతున్న ఆదిలాబాద్.. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చలి!

Weather Update: ఆదిలాబాద్ జిల్లాలో శీతల గాలుల తీవ్రత పెరిగింది. గతంలో ఎన్నడు లేని విధంగా నవంబర్ మూడో వారంలో ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రహదారులన్నీ మంచు దుప్పట్లు కప్పుకున్నాయి. మూడు దశాబ్దాలుగా ఎన్నడూ ఇంతటి చల్లటి వాతావరణం చూడలేదని స్థానికులు చెబుతున్నారు. చలికి తోడుగా శీతలగాలుల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఉత్తరాది నుంచి చలిగాలుల తీవ్రత పెరిగి పోవడంతో పలు చోట్ల చలిమంటలు వేసుకుంటున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. మారిన వాతవరణ పరిస్థితులతో రహదారులు జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. ప్రజలు ఇంటిపట్టునే ఉండేందుకు మక్కువ చూపుతున్నారు. మరో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పతనవుతాయని వాతావరణ అధికారులు ప్రకటించడంతో ప్రజల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. .మొత్తంగా పెరిగిన చలికి శీతల గాలులు కూడా తొడవ్వడంతో ప్రజలు వణికిపోతున్నారు. 

Tags:    

Similar News