Cold Wave: ఆదిలాబాద్ జిల్లాలో వణికిస్తున్న చలి తీవ్రత.. రోజురోజుకు పతనమవుతున్న ఉష్ణోగ్రతలు
Cold Wave: ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత కశ్మీర్‌ను తలపిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాపై శీతాకాలం పగబట్టిందా అన్నట్లుగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి.
Cold Wave: ఆదిలాబాద్ జిల్లాలో వణికిస్తున్న చలి తీవ్రత.. రోజురోజుకు పతనమవుతున్న ఉష్ణోగ్రతలు
Cold Wave: ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత కశ్మీర్‌ను తలపిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాపై శీతాకాలం పగబట్టిందా అన్నట్లుగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. తెల్లారింది మొదలు సాయంత్రం వరకు ప్రజల్లో చలిపైనే చర్చసాగుతోంది. 4 రోజులుగా 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
చలి ప్రభావం ఇటు మూగ జీవాలపై కూడా ప్రభావం చూపుతోంది. జిల్లాలోని పలు మండలాలల్లో సరాసరి 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వ్యవసాయానికి ఆయువుపట్టైన మూగజీవాలు చలితో విలవిల లాడుతున్నాయి. చలి వాతావరణం కారణంగా పశువులకు ఆహార కొరత నెలకొంది. చలి తీవ్రతతో బసవన్నలు వ్యవసాయ పనులకు ఇబ్బందులు పడుతున్నాయి. భీంపూర్ మండలం అర్లి-టీ తో పాటు ఇచ్చోడ, బోథ్, నేరేడిగొండ, ఇంద్రవెల్లి మండలాల్లో రోజురోజుకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
మూగజీవాలకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు రైతులు గోనే సంచులతో స్వెటర్స్ల్ తయారు చేయించి తొడుగుతున్నారు. అయితే వయసు మళ్లిన పశువులు చలి గాలికి మృత్యువాత పడుతున్నాయి. రైతులు మూగజీవాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని... పశువుల పాకలో వెచ్చగా ఉండే ప్రదేశాల్లో వాటిని ఉంచాలని... ప్రతి 4 గంటలకు ఒకసారి ఆహారం అందించాలని పశువైద్యలు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇళ్లలో పెంచుకునే కుక్కలకు కూడా చలి నుంచి యజమానులు రక్షణ కల్పిస్తున్నారు. వాటికి కూడా అందుబాటులో ఉండే వాటితో స్వెటర్స్ తయారు చేయించి తొడుగుతున్నారు. అయితే చలి తీవ్రత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నందున ప్రజలతో పాటు... మూగ జీవాల సంరక్షణకు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలని అధికారులు జాగ్రత్తలు సూచిస్తున్నారు.