అన్నార్తులను ఆదుకుంటున్న ప్రెండ్స్ యూత్ సేవలకు నటుడు ప్రియదర్శి అభినందనలు
కరోనా మహమ్మారి కట్టడి కోసం మోడీ ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కరోనా మహమ్మారి కట్టడి కోసం మోడీ ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ వల్ల వలస కూలీలు, రోజు వారీ కూలీలు, పనులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ 14న ప్రధాని మోడీ దేశంలో పెరుగుతున్న కరోనా కాసుల దృష్ట్యా లాక్ డౌన్ ను మే 03వరకు పొడిగిస్తూ ప్రకటన చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లో ప్రభుత్వం పేదవారి కోసం ఉచితంగా రేషన్ పంపిణీ, కుటుంబానికి 1500 చొప్పున ఆర్ధిక సహాయం చేస్తున్న విషయం తెలిసిందే.
వలస కూలీలు, రోజు వారీ కూలీలు, పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికోసం పలువురు తమ వంతు సహకారాన్ని అందిస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా యువకులు లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూనే ఆపదలో వున్నవారిని ఆదుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆకలితో వున్న వారిని ఆదుకునేందుకు శేరిలింగంపల్లి యువత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పేదల ఆకలి తీరుస్తోంది. శేరిలింగంపల్లి నియోగికవర్గం చందానగర్ లో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అద్వర్యం లో 20 రోజులు గా తమ పరిసర ప్రాంతాల్లో రోజుకు సుమారు ౩౦౦ మందికి ఆహారాన్ని అందిస్తున్నారు.
ఈ యువకులకు ప్రస్తుతం తమ పుట్టినరోజు..పెళ్లిరోజు.. ఇలా వేడుకలన్నీ పేదలకు పట్టెడన్నం పెట్టడంలోనే సంతృప్తి. వీరి ప్రయత్నాన్నకి అందరూ ప్రోత్సాహం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం వీరి ఆహార వితరణ కార్యక్రమాన్ని..ప్రముఖ సినిమా నటుడు ప్రియదర్శి అభినందించారు. ప్రెండ్స్ యూత్ అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చారు. గత 20 రోజులగా సేవలో పాల్గొన్న రామరాజు, నాగ మహేష్, స్వరూప్ వర్మ, ప్రశాంత్, శేఖర్ రెడ్డి, వికాస్ పులిపాటి, అన్నపూర్ణ, హైమావతి, రామ లక్ష్మి, ఆదిత్య, సాహిత్య వర్మ, అన్వేష వర్మ, క్రాంతి వర్మ, నిఖిల్ మేధా, విక్రాంత్ యాదవ్, మనోజ్ శెట్టి లను ప్రియదర్శి ప్రత్యేకంగా అభినందించారు.