ఏబీవీపీ 38 వ రాష్ట్ర మహా సభల గోడ పత్రికలు విడుదల

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర 38వ మహా సభల గోడ పత్రికలను పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది.

Update: 2019-12-13 08:27 GMT
జిల్లా కన్వీనర్ ఊషణ అన్వేష్, కార్యకర్తలు తుమ్మ అనిల్, కావ్య, సహన, శ్రావణి, హసన్ బాబు, రాజ్ కుమార్

ధర్మారం: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర 38వ మహా సభల గోడ పత్రికలను పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఊషణ అన్వేష్ మాట్లాడుతూ... ఈ నెల 17,18,19,20వ తేదీలలో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో జరగనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గత 70 సంవత్సరాలుగా విద్యార్థి పరిషత్ అనేక ఉద్యమాలు చేసుకుంటూ విద్యార్థుల యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందన్నారు.

ఈ యొక్క మహా సభలలో విద్యారంగ, ఆర్థిక, నిరుద్యోగ స్థితి గతుల పై, మహిళల పై జరుగుతున్న అత్యాచారాల పై తీర్మానాలు చేయడం జరుతుందని అన్నారు. ఈ యొక్క మహా సభలకు రాష్ట్ర గవర్నర్, కేంద్ర మంత్రులు, ఏబీవీపీ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ సభలలో 2000మంది విద్యార్థి పరిషత్ పాల్గొననున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఊషణ అన్వేష్, కార్యకర్తలు తుమ్మ అనిల్, అరికిల్ల అజయ్, దొంత హర్షవర్ధన్, కావ్య, సహన, శ్రావణి, హసన్ బాబు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News