Fire Paan: మీరెప్పుడైనా ఈ ఫైర్ ఫాన్ తిన్నారా?

మీటా పాన్.. రసగుల్లా పాన్.. స్వీట్ పాన్.. కలకత్తా పాన్ పేరు వినని వారు ఉండరు. వీటన్నింటికి మించి భిన్నంగా యువతలో జోష్ నింపుతోంది

Update: 2020-02-24 04:29 GMT
Fire paan (File Photo)

మీటా పాన్.. రసగుల్లా పాన్.. స్వీట్ పాన్.. కలకత్తా పాన్ పేరు వినని వారు ఉండరు. వీటన్నింటికి మించి భిన్నంగా యువతలో జోష్ నింపుతోంది ఫైర్ ఫాన్. ఒక్క పాన్ నమిలితే కిరాక్ పుట్టిస్తోంది..మొద్దు నిద్రలో ఉన్న వారికి అగ్గిరాజేసి ఉత్సాహాన్ని పరుగులు పెట్టిస్తోంది.. ఇంతకు ఈ ఫైర్ పాన్ స్పెషాలిటీ ఎంటో..ఎక్కడ దొరుకుతుందో ఓ సారే టేస్ట్ చూసొద్దాం...

రసగుల్లా పాన్..మీటా పాన్ లు బండలాంటి మనస్సున్నావారిని సైతం కరిగిస్తుంటాయి.. అనుంబంధాలను....అప్యాయతను పంచుతాయి. మనం తిన్న పాన్ లు ఆ ప్రాంతాలను జీవితాంతం గుర్తు చేసుకునేలా చేస్తాయి..మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ లోని మోహిద్ పాన్ షాప్ కిల్లిలకు ప్రసిద్ది. ఇక్కడ తయారు చేసిన ఫైర్ పాన్ తింటే చాలు..మళ్లీమళ్లీ తినాలనిపించే విధంగా పాన్ ప్రియులను ఆకట్టుకుంటుంది.

పాన్ లో వేసే లవంగాలకు నిప్పు పెట్టడంతో కిల్లిలో మండుతుంది. ఇది ఆరోగ్యానికి ఎలాంటి నష్టం లేదంటున్నారు..ఫైర్ పాన్ తో పాటు రసగుల్లా,మీనాక్షి, దిన్ కారాజా, రాత్ కా రాణి కిల్లీలు ఇక్కడ దొరుకుతాయి. ఎలాంటి రాసాయనాలు లేకుండా తయారు చేస్తున్న కిల్లీలు తింటే జీర్ణవ్యవస్థను ముందుకు సాగిస్తుందంటున్నారు పైర్ పాన్ ప్రియులు..ఈ పాన్ తినడం సైడ్ ఎపెక్ట్ లేవని ఆనందం వ్యక్తం వేస్తున్నారు

ప్రతి రోజు సాయంత్రం ఐదు నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే ఫైర్ పాన్ అమ్మకాలు సాగిస్తున్నారు. పాన్ ప్రియులను మనస్సు దోచుకున్న ఫైర్ పాన్ కు భారీ డిమాండ్ ఉంటుందంటున్నారు షాపు యజమాని. ఫైర్ పాన్ రుచిచూసిన వాళ్లు మళ్లీ మళ్లీ ఇక్కడికి వస్తుంటారు. ఎక్కువగా ఫైర్ పాన్ తినడానికి యువకులు ఆసక్తి చూపుతున్నారు. 

Tags:    

Similar News