Hyderabad: హైదరాబాద్‌లో వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష
Hyderabad: ఈ నెల 18 నుంచి 28 వరకు గణేష్ నవరాత్రోత్సవాలు
Hyderabad: హైదరాబాద్‌లో వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష
Hyderabad: హైదరాబాద్ మహానగరంలో వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ భేటీకీ కమిషనర్ రొనాల్డ్ రోస్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు, ఆర్‌అండ్‌బీ, ఫైర్, హెల్త్ ఆయా శాఖల ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. ఈ నెల 18 నుంచి 28 వరకు జరిగే వినాయక చవితి ఉత్సవాలపై సమీక్షించారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నవరాత్రోత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.