Talasani Srinivas Yadav: బీసీ నేతలపై దాడి చేస్తే ఊరుకునేది లేదు..

Talasani Srinivas Yadav: రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకం చేస్తున్నాం

Update: 2023-07-19 09:16 GMT

Talasani Srinivas Yadav: మంత్రి తలసాని నివాసంలో ముగిసిన బీసీ ప్రజాప్రతినిధుల భేటీ

Talasani Srinivas Yadav: మంత్రి తలసాని నివాసంలో బీసీ ప్రజాప్రతినిధుల భేటీ ముగిసింది. ఈ సమావేశానికి బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరైయ్యారు. బీసీలను కించపరిచే వ్యాఖ్యలపై పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీలపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని మంత్రి తలసాని అన్నారు. బీసీ నేతలపై దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడటం బాధాకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకం చేస్తున్నామని.. బీసీ నేతలను చులకన చేసి మాట్లాడితే సహించమని తలసాని అన్నారు.

Tags:    

Similar News