Hyderabad: రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేసిన కుక్క.. 16 మందికి గాయాలు
Hyderabad: నిత్యం జనాలపై దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్న కుక్కలు
Hyderabad: రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేసిన కుక్క.. 16 మందికి గాయాలు
Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల బెడదకు ఫుల్‌స్టాప్ పడడంలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట కుక్కలు రెచ్చిపోతూ జనాలపై దాడులు చేస్తున్నాయి. హైదరాబాద్ బాలా నగర్ వినాయక్ నగర్‌లో ఓ వీధి కుక్క రెచ్చిపోయి దాదాపు 16 మందిపై దాడి చేసింది. నిన్న సాయంత్రం..వీధిలో ఆడుకుంటున్న చిన్నారులతో పాటు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ప్రతీ ఒక్కర్నీ వీధి కుక్క కాటేసింది. ఈ ఘటనలో 16 మందికి గాయాలు కాగా అందులో 8 మంది చిన్నారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ రవీందర్ రెడ్డి, GHMC సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో కుక్కను పట్టుకునేందుకు GHMC సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. చివరకు దానిని పట్టుకొని అక్కడి నుండి తరలించారు. జరిగిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల నుండి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.