Mahabubnagar District: మహబూబ్‌నగర్ జిల్లా తాటికొండ శివారులో చిరుత మృతి
* చిరుత బాడీపై గాయాలు కనిపించకపోవడంతో అనుమానాలు
మహబూబ్‌నగర్ జిల్లా తాటికొండ శివారులో చిరుత మృతి
Mahabubnagar District: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని తాటికొండ గ్రామ శివారులో చిరుత మృతి చెందింది. రోడ్డు దాటేటప్పుడు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందినట్లుగా అధికారులు భావిస్తున్నారు. అయితే చిరుత బాడీపై పెద్దగా గాయాలు లేకపోవడం కొన్ని అనుమానాలకు దారి తీస్తోంది. భూత్పూర్ పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని చిరుత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.